కీవ్, అక్టోబర్ 4: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కీలక వంతెనలను లక్ష్యంగా చేసుకుని రష్యా వరుసగా నాలుగో రోజూ దాడులు కొనసాగించింది. నార్తర్న్ బ్రిడ్జిపై మళ్లీ దాడి జరిగినట్లు కథనాలు తెలిపాయి. దీంతో నగరంలో రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

రాకపోకలు సులభతరం చేసేందుకు పాంటూన్ క్రాసింగ్‌లు నిర్మించే ప్రణాళిక ఉందని, అందుకు మూడు నెలల వరకు సమయం పట్టవచ్చని ఓ ఉక్రెయిన్ అధికారి చెప్పినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా, రష్యా ప్రయోగించిన ఐదు క్షిపణులు, డ్రోన్లు శనివారం రాత్రి మోల్డోవా భూభాగంలో పేలాయని ఆ దేశ అధ్యక్షురాలు మాయా సాండు తెలిపారు. రష్యాను అడ్డుకోవాలని, లేకపోతే యూరప్ అంతటా ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆమె హెచ్చరించారు.