మెరుగైన ఆరోగ్య ఆహార ఉత్పత్తుల తయారీ రంగంలో అసాధారణమైన లక్ష్యాలను సాధించి, నాణ్యమైన ప్రోడక్ట్‌లను మార్కెట్లో విక్రయిస్తున్న ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకమైన ఎఫ్‌ఐ ఇండియా అవార్డును కైవసం చేసుకుంది. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన ఎఫ్‌ఐ ఇండియా ఫోర్త్ ఎడిషన్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ డైరెక్టర్ మండలనేని సుబ్రహ్మణ్యం అవార్డును అందుకున్నారు.

బెంగళూరుకు చెందిన ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మెరుగైన జీవనానికి కట్టుబడి నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తోంది. ఐ పల్స్, ఐ కేర్, ఐ కాఫీ, ఐ గ్లో, ఐ స్లిమ్, ఐ గైన్ పేరిట ఆహార ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తోంది.

అకాయ్ బెర్రీ ప్రధానంగా ఉండడంతో పాటు 15 పండ్లతో కూడిన ఐ పల్స్‌ను ఫ్రూట్ డ్రింక్‌గా అమ్ముతారు. ఇమ్యూనిటీ బూస్టింగ్‌కు, ఎనర్జీ కోసం ఈ పానీయం ఉపకరిస్తుందని చెబుతారు. ఐ స్లిమ్ బరువు తగ్గడానికి, ఐ గ్లో చర్మ సౌందర్యానికి, ఐ గైన్ బరువు పెరగడానికి అని చెప్పే ప్రోడక్ట్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. మధుమేహం ఉన్నవారికి అని చెప్పే ఐ కాఫీ బ్లాక్‌తో పాటు ఐ కాఫీ క్రీమర్‌కు వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అందించే ఈ ఉత్పత్తులను ఆహార సప్లిమెంట్లుగా మాత్రమే కంపెనీ చెబుతుంది.

పుష్కర కాలంగా ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ మెరుగైన జీవనానికి దోహదపడేలా అంకితభావంతో ఉత్పత్తులు తయారు చేసే ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రతిష్టాత్మకమైన ఎఫ్‌ఐ ఇండియా అవార్డు దక్కడం పట్ల వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటు వినియోగదారుల్లో కూడా హర్షం వ్యక్తం అవుతోంది.