భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య రక్షణ పారిశ్రామిక సహకారంపై ఇరు దేశాల ప్రతినిధులు సమీక్ష నిర్వహించారు. రాబోయే పదేళ్లకు సంబంధించిన సహకార రోడ్‌మ్యాప్‌పై చర్చించారు.

రక్షణ తయారీ, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉమ్మడి పరిశోధన-అభివృద్ధి ప్రాజెక్టుల విస్తరణపై ఇరు దేశాలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ రక్షణ తయారీని ప్రోత్సహిస్తూనే, అంతర్జాతీయ భాగస్వాములతో సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై భారత్ దృష్టి సారించిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.