80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లఖ్నవూలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్ర పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సాధించిన పురోగతిని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు.
కుంభమేళా నిర్వహణ విజయవంతం, పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో పురోగతిని ఆయన ప్రజలతో పంచుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, అధికారులు జాతీయ పతాకావిష్కరణలో పాల్గొన్నారు.
