హైదరాబాద్, సెప్టెంబర్ 20: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టు అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో నిధులు సమకూర్చే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
నగర శివారు ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీని విస్తరించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు, ఐటీ కారిడార్‌కు మరింత ఊతం ఇవ్వాలన్నది ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు తెలిపారు.
భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ప్రాజెక్టు వ్యయ అంచనాలను తుది రూపు ఇచ్చి కేంద్రానికి పంపాలని సీఎం సూచించారు.
