అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, డాలర్ మారకం విలువలో హెచ్చుతగ్గుల నేపథ్యంలో దేశీయ బంగారం ధర మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గణనీయంగా పెరిగినట్టు స్రాఫ్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత సాధనమైన బంగారం వైపు మళ్లిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరల పెరుగుదల ఆభరణాల వ్యాపారంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వర్తకులు అంచనా వేస్తున్నారు.
