87వ వార్డులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

గాజువాకలో సెప్టెంబర్ 2న జరిగిన ఈ కార్యక్రమాన్ని గౌరవ అధ్యక్షులు శ్రీ సిరసపల్లి కనకరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కర్రి దినేష్ విహార్ విచ్చేసి పాల్గొన్నారు.

అభివృద్ధి పథంలో రాష్ట్రం: నేతల అభినందన

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని నేతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కర్రి నర్సింగ్ రావు, కోరుకొండ శ్రీధర్, నాయుడు, శేషు, ఎస్.బెనర్జీ, గొంతిన ప్రసాద్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.