గాజువాక: జీవీఎంసీ 65వ వార్డు బానోజీ తోట వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణి నక్షత్రం (స్వామివారి జన్మ నక్షత్రం) సందర్భంగా స్వామివారికి మహాభిషేకం జరిగింది. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో వైభవంగా వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసచార్యులు చే ప్రత్యేక అలంకరణ చేసి మహాభిషేకం నిర్వహించారు.

ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి నెల శ్రావణి నక్షత్రం రోజున స్వామివారి జన్మదిన మహాభిషేకం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఉత్తర ద్వారంలో ఉత్తరాంధ్రలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది రెండవదని పేర్కొన్నారు. స్వామివారిని ఏడు వారాలు ముడుపులు కట్టి పూజలు చేసినవారికి స్వామివారి కృపా కటాక్షాలు ఉంటాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

అనంతరం తీర్థప్రసాదాల వితరణ జరిగింది. కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులకు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుతున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బుద్ద రమణ, పెంటకోట రాజు, గొరుసు రామలక్ష్మి, లక్ష్మి, భవ్య, రుక్మందర్, నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.