గాజువాక అగనంపూడి ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న అగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణకు టీడీపీలో ప్రత్యేక గుర్తింపు ఉందని 85వ వార్డు మాజీ కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్, 85వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కర్రి దశేంద్ర అన్నారు.

బలిరెడ్డి సత్యనారాయణ జన్మదిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అగనంపూడి ప్రజల తరఫున ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో సమన్వయం చేస్తూ అగనంపూడి అభివృద్ధి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో సత్యనారాయణ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నాయకత్వంలో నిబద్ధత, సేవలో నిజాయితీ, ప్రజల పట్ల మానవత్వం ఆయన ప్రత్యేకతలని పేర్కొన్నారు.

పలు పార్టీల నేతల శుభాకాంక్షలు

టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ “మీ ప్రతి అడుగు అగనంపూడి అభివృద్ధికి బాటలు వేయాలి.. ఆయురారోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవ చేయాలి” అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 85వ వార్డు మాజీ కార్పొరేటర్ ఇల్లపు ప్రసాద్, టీడీపీ అధ్యక్షుడు కర్రి దశేంద్ర, విశాఖ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు గంతకూరు అప్పారావు, తెలుగు యువత అధ్యక్షుడు బండారు చందు, రమేష్, యలమంచిలి రమణ, వడ్డాది శ్రీనివాసరావు, పలక అచ్యుత్, ఊరిటి అప్పలరాజు, ఆపిల్ నెట్‌వర్క్ అధినేత లక్కరాజు శ్రీను, జనసేన నాయకులు విందుల నర్సింగరావు, విందుల నాగేంద్ర, విందుల కళ్యాణ్, కరణం శ్రీను, బీజేపీ నాయకులు చిన్ని పూర్ణ, హ్యూమన్ రైట్స్ విశాఖ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్. సుబ్రహ్మణ్యం, ఎం. సత్యారావు, విందుల శ్రీనివాసరావు, టీడీపీ మహిళా విభాగం నాయకురాలు ఈగల లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.