న్యూఢిల్లీ, అక్టోబర్ 2 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పొందిన అనుభవాన్ని ఫ్రాన్స్ అధ్యయనం చేస్తోందని ఫ్రెంచ్ వైమానిక, అంతరిక్ష దళ ఉపాధిపతి లెఫ్టినెంట్ జనరల్ డొమినిక్ తార్డిఫ్ తెలిపారు.
ఆ ఆపరేషన్ స్థాయి, సంక్లిష్టత కారణంగానే దీనిపై ఆసక్తి చూపుతున్నామని ఆయన చెప్పారు. ఒకే యుద్ధ క్షేత్రంలో ఏకకాలంలో పెద్ద సంఖ్యలో విమానాలు పనిచేయడం ఈ ఆపరేషన్‌ను ఫ్రాన్స్‌తో పాటు ఇతర వైమానిక దళాలకూ ప్రత్యేకంగా నిలిపిందన్నారు.
బహుశా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద స్థాయి వైమానిక కార్యకలాపాలను తాము చూడలేదని, అందువల్ల ఐఏఎఫ్ అనుభవం ఎంతో ఆసక్తికరమైనదని తార్డిఫ్ వ్యాఖ్యానించారు.
