సుబిక్ బే (ఫిలిప్పీన్స్), సెప్టెంబర్ 30: ఆసియాన్–ఇండియా సముద్ర విన్యాసం (ఏఐఎంఈ–2026) రెండో ఎడిషన్ ఫిలిప్పీన్స్లోని సుబిక్ బేలో సెప్టెంబర్ 28న ప్రారంభమైంది. భారత నౌకాదళం నుంచి ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కులిష్ నౌకలు, ఆసియాన్ సభ్య దేశాల సముద్ర బలగాలు పాల్గొంటున్నాయి.
- ఇతివృత్తం: 'ఆంకర్డ్ ఇన్ ట్రస్ట్, యునైటెడ్ ఎట్ సీ'
- ప్రారంభ కార్యక్రమానికి ఫిలిప్పీన్స్లో భారత రాయబారి హర్ష్ కుమార్ జైన్ గౌరవ అతిథిగా హాజరయ్యారు
- వృత్తిపరమైన, కార్యాచరణ, సామాజిక కార్యక్రమాల ద్వారా పరస్పర అవగాహన, సహకారం, సమన్వయం పెంపు లక్ష్యం
భారత 'యాక్ట్ ఈస్ట్' విధానం, 'మహాసాగర్' (ప్రాంతాల మధ్య భద్రత, వృద్ధిలో పరస్పర, సమగ్ర పురోగతి) దృక్పథానికి అనుగుణంగా ఈ విన్యాసం నిర్వహిస్తున్నట్లు నౌకాదళం తెలిపింది. ఈ రెండు నౌకలు సెప్టెంబర్ 21న సుబిక్ బే చేరుకున్నాయి.