ఓటు హక్కును కాపాడుతూ అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ఆయన కీలక సూచనలు చేశారు.

రాష్ట్రంలో 73.39 లక్షల నమోదులను గైర్హాజరు, శాశ్వతంగా తరలిపోయినవారు, మరణించినవారు, నకిలీ నమోదుల విభాగాల్లో గుర్తించినట్లు సీఎం తన లేఖలో పేర్కొన్నారు. వీటిలో 45.19 లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారిగా గుర్తించినట్లు తెలిపారు.

క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసుకునే గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరిన రేవంత్ రెడ్డి, ముసాయిదా ఓటర్ల జాబితాలను గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాల్లో బహిరంగంగా చదివి వినిపించాలని సూచించారు.

పట్టణ ప్రాంతాల్లో ఓటర్లకు సహాయం అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఒక్క అర్హుడైన ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకూడదన్నదే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.