వారణాసి, సెప్టెంబర్ 17: ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగానికి అద్భుత స్పందన లభించింది. సీఎం ప్రసంగానికి సభా మందిరం చప్పట్లతో మార్మోగింది.
సభికులను భాగస్వాములను చేస్తూ ప్రసంగం
సభికులను ఇన్వాల్వ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రామజన్మభూమి మొదలుకుని ఆపరేషన్ సింధూర్ వరకు ప్రతి అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు, కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు అందిస్తున్న సహకారాన్ని కూడా సీఎం చంద్రబాబు వివరించారు.
రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
సీఎం చంద్రబాబు ప్రసంగం ప్రారంభించడానికి ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ప్రసంగం అనంతరం "వెరీ వెల్... వెరీ వెల్" అంటూ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు ప్రసంగానికి చప్పట్లతో అభినందనలు తెలపాలని రక్షణ మంత్రి సభికులను కోరారు.
