స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

ఆంధ్ర కేసరిగా ప్రజల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్య్ర పోరాటంలో పోషించిన పాత్రను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ప్రకాశం పంతులు ఆదర్శాలను, త్యాగనిరతిని నేటి తరం గుర్తుంచుకోవాలని, ఆయన చూపిన స్ఫూర్తితో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని సీఎం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.