కుప్పం, సెప్టెంబర్ 21: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల నియామకాలపై సాగుతున్న దుష్ప్రచారంపై కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

  • డీఎస్సీ ఉద్యోగాలు తమ కష్టార్జితమని టీచర్లంతా నినదిస్తున్నారు
  • ఫేక్ పార్టీ అందరినీ ఫేక్ అంటే సహించేది లేదని విజయవాడలో స్పోర్ట్స్ టీచర్లు ఆందోళన చేస్తున్నారు
  • ఇవాళ విజయవాడలో రౌడీలు గురువులపై దాడి చేస్తున్నారు
  • టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. చర్యలు తీసుకుంటాం
  • సీబీఎన్ జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లలో అవినీతే జరగదు. నా హయాంలో ఎప్పుడూ పేపర్ లీక్ కాలేదు
  • సీబీఎన్ పాలనలో టీచర్ల రిక్రూట్‌మెంట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం... ఇదీ మన ట్రాక్ రికార్డ్
  • నియామకాలు జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు లేనిపోని దుష్ప్రచారం చేస్తూ బురద జల్లుతున్నారు
  • కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం, విశాఖలో సముద్రం ఒడ్డున దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ టీచర్లు గర్జించారు
  • ఫేక్ పేపర్‌కు చెందిన రిపోర్టర్ ఓ ఉపాధ్యాయుడిపై దాడి చేశారంటే... వైసీపీ మూకలు ఎంతకు బరితెగించాయో అర్థం చేసుకోండి
  • ఇలాంటి వాళ్లను ఇంకా ఉపేక్షించాలా..? వీరిలాగే కొనసాగితే ఆస్తులకు ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందా..?
  • అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే సాక్ష్యాధారాలతో చూపించి వారి నోళ్లూ మూయిస్తాం
  • చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియపై అవసరమైతే కోర్టులకు వెళ్లొచ్చు... కానీ దాడులేంటీ...? ఉపాధ్యాయులపై రౌడీలను ఎగదోయడమేంటీ..?
  • 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. రాష్ట్రానికి అది మామూలు నష్టం కాదు
  • నాటి పాలనలో పాలకులే రౌడీయిజం చేశారు, దారుణాలకు పాల్పడ్డారు
  • కుప్పం వస్తే నన్ను కూడా ఇబ్బందులు పెట్టారు.. దౌర్జన్యాలకు దిగారు
  • ఓడిపోయిన తర్వాత కూడా చంపడానికైనా చావడానికైనా సిద్ధం అంటూ రౌడీయిజం చేస్తున్నారు
  • రౌడీయిజం చేసే వారి తోక కత్తిరిస్తాం. రౌడీలను విధ్వంసకారులను తరిమి కొట్టే సత్తా కుప్పానికి ఉంది
  • ఫ్లెక్సీలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రక్తాభిషేకం చేస్తున్న వారిని సైకోలు అనాలా..? మానసిక రోగులు అనాలా..?
  • తిరుమల పవిత్ర లడ్డూను కూడా కల్తీ చేశారు
  • ప్రతీ ఎన్నికలోనూ సైకిల్ గుర్తుకు మాత్రమే ఓటేసి మద్దతిచ్చిన నియోజకవర్గాలు ఒకటి కుప్పం, రెండోది హిందూపూర్