కుప్పం, సెప్టెంబర్ 20: కుప్పం రైల్వే స్టేషన్‌లో 'దాదర్ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్' రైలుకు అదనపు హాల్ట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, పలువురి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.
- రైలు నెం. 11005కు అదనపు హాల్ట్‌తో నెరవేరిన కుప్పం ప్రజల చిరకాల ఆకాంక్ష
- ప్రయాణికులకు మెరుగైన రైలు కనెక్టివిటీ
- కుప్పం ప్రజల అవసరాల మేరకు రైల్వే సేవల విస్తరణ
