కుప్పం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ సంస్థలతో కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) ఎంఓయూలు కుదుర్చుకుంది. ఇదే కార్యక్రమంలో సెర్ప్‌తో కలిసి రూపొందించిన "మన రోవర్" మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.

  • కుప్పంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీతో ఎంఓయూ
  • కింబర్లైట్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థ రూ.90 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కాడాతో ఒప్పందం
  • రూ.250 కోట్ల పెట్టుబడితో హెర్బల్ ఉత్పత్తుల యూనిట్ ఏర్పాటుకు న్యూట్రలా జెనికా సంస్థ ఎంఓయూ... 700 మందికి ఉపాధి
  • బొటానికల్ ఎక్స్‌ట్రాక్ట్స్ ప్రాజెక్టు కోసం రూ.67 కోట్ల పెట్టుబడి, 8,250 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించేలా పయనీర్ ఎక్స్‌ట్రాక్ట్స్ లిమిటెడ్
  • రూ.150 కోట్లతో ఫ్రోజెన్ ఫుడ్స్, ఐస్ క్రీమ్ తయారీ కోసం ఎంగమ్ డైరీ ఫుడ్స్ ఎంఓయూ. 1,400 మందికి ఉపాధి అవకాశాలు
  • ప్లాంటెక్స్ హెల్త్‌కేర్ ఆరోగ్యపరమైన ఉత్పత్తుల తయారీకి రూ.25 కోట్ల పెట్టుబడి కోసం కాడాతో ఒప్పందం