అమరావతి, ఆగస్ట్ 26 :- తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు-కంటైనర్ ఢీకొనడంతో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రమాదానికి సంబంధించిన సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించేలా తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
