అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రూపంలో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించిన సీఎం, ఎన్నికల హామీ మేరకు మార్కాపురంను కొత్త జిల్లాగా ప్రకటించడంతో పాటు ఆ ప్రాంతాన్ని ప్రతిష్టాత్మక హార్టీకల్చర్ హబ్‌లో చేర్చినట్లు వివరించారు.
రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన చంద్రబాబు, ఈ ఏడాది సెప్టెంబర్ 2న పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్‌కు అధికారికంగా జలహారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
వైఎస్సార్సీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమం, అభివృద్ధి, ప్రాజెక్టుల పూర్తి దిశగా తమ కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గదని సీఎం తేల్చిచెప్పారు.
