భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, తన 65 మంది సభ్యుల కొత్త జట్టును ప్రకటించారు. ఇందులో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, 16 మంది కార్యదర్శులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దగ్గుబాటి పురందేశ్వరితో పాటు రామ్‌మాధవ్‌ను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. మొత్తం జట్టులో 51 మంది కొత్తవారికి చోటు దక్కడం విశేషం.
అయితే, జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఏ ఒక్క నేతకూ ప్రధాన బాధ్యతలు దక్కకపోవడంపై ఆ రాష్ట్ర భాజపా శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కొత్త కమిటీ రానున్న ఎన్నికల వ్యూహాలకు దిశానిర్దేశం చేస్తుందని, రాష్ట్రాలవారీగా సమతూకం పాటించే ప్రయత్నం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
