ప్రస్తుతం మూడు మార్గాల్లో 95 కిలోమీటర్ల మేర సేవలందిస్తున్న బెంగళూరు మెట్రో, దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 41 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ విస్తరణతో నిత్యం సుమారు 15 లక్షల మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు, ఐటీ కారిడార్లకు మెరుగైన అనుసంధానత కల్పించడం ఈ విస్తరణ లక్ష్యం.
కావేరీ దశ-6లో భాగంగా జైకా సహకారంతో రూ.6,939 కోట్లతో అదనంగా ఆరు టీఎంసీల నీటిని నగరానికి తరలించే ప్రాజెక్టుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది నగర జనాభాలో 1.4 కోట్ల మంది తాగునీటి అవసరాలను తీర్చనుంది.
రహదారుల విస్తరణ, పాదచారుల మార్గాల అభివృద్ధి, జంక్షన్ల సుందరీకరణ వంటి పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా బెంగళూరు నగరంలో వేగంగా చేపడుతున్నారు.
