అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతరిక్ష రంగ పెట్టుబడులకు అనువైన మౌలిక సదుపాయాలు, విధానాలను రాష్ట్రం సిద్ధం చేస్తోందని తెలిపారు.
అంతరిక్ష, రక్షణ రంగాల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఈ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు.
టెక్నాలజీ ఆధారిత రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రానున్న రోజుల్లో పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదరనున్నాయని చంద్రబాబు తెలిపారు.
