న్యూఢిల్లీ, అక్టోబరు 24: ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

అనంతరం కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తోనూ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించారు.

ఏపీలో ప్రతిపాదించిన సెమికండక్టర్ ప్రాజెక్టుతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.