విజయవాడ, సెప్టెంబర్ 29: దేశ భవిష్యత్తు కోసం ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

  • విజయవాడ అంబేడ్కర్ కళావేదికలో ‘మిషన్ కర్మయోగి’ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్ ప్రారంభం
  • యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా వ్యవస్థలు పనిచేయాలని సూచన

రానున్న 20 ఏళ్లలో భారత్ అగ్రస్థానానికి ఎదగాలంటే యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా వ్యవస్థలు పనిచేయాలని సీఎం అన్నారు. విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించిన ‘మిషన్ కర్మయోగి’ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్‌ను ప్రారంభించి ఆయన మాట్లాడారు.