కర్నూలు, అక్టోబర్ 17 (ఎక్స్‌ప్రెస్ టుడే): నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సమక్షంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. 15వ వార్డుకు చెందిన రాజ్‌ధార్ ఖాన్ సూరి, జిలానీ, 14వ వార్డుకు చెందిన షబీర్ టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అయితే పార్టీలోకి మంచి వ్యక్తులను గుర్తించి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. నాయకులు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం 62వ వార్డుకు చెందిన రవి కుమార్, శివ కుమార్‌లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.