కర్నూలు, అక్టోబర్ 15 (ఎక్స్ప్రెస్ టుడే): రాంబొట్ల దేవాలయం వద్ద కలశయాత్రను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు.
చిన్న అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మూలా నక్షత్రం సందర్భంగా 108 కలశాలతో తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించేందుకు ఈ కలశయాత్ర చేపట్టారు. మహిళలు రాంబొట్ల దేవాలయం నుంచి చిన్న అమ్మవారి శాల వరకు 108 కలశాలతో ఊరేగింపుగా తరలివెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. ఎన్నో దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని భక్తులు కొనసాగించడం అభినందనీయమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి, రైతులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
