కర్నూలు, అక్టోబర్ 10 (ఎక్స్ప్రెస్ టుడే): త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కర్నూలు నగర శివార్లలోని అథేనా స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్, ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పరిశీలించారు.
ఈ తనిఖీలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కూడా పాల్గొన్నారు.
