విజయవాడ, అక్టోబర్ 3 (ఎక్స్ప్రెస్ టుడే): తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో శనివారం జరిగిన బాయిలర్ పేలుడులో నలుగురు కార్మికులు మరణించడం, మరికొందరు గాయపడటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.
మరణించిన వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
