అమరావతి, సెప్టెంబర్ 27: రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత శాఖ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు.

  • 28 జిల్లాల్లో 70 హోటళ్లు, రెస్టారెంట్లపై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు
  • 25 సంస్థల మూసివేత
  • 30 కేసుల నమోదు

ఆహార నాణ్యత ప్రమాణాల ఉల్లంఘనలను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో ఏకకాలంలో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 70 హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయగా, 25 సంస్థలను మూసివేయించారు. 30 కేసులు నమోదు చేశారు.