ఎక్స్ప్రెస్ టుడే, సెప్టెంబర్ 29: తక్షణ రాజకీయ లాభాలు లేదా ఓట్ల కోసం కాకుండా, రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పేద ప్రజలకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టాలన్నది చంద్రబాబు నాయుడు సంకల్పం. ఆ సంకల్పాన్ని నిజం చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు నాయుడు సంకల్ప బలం. అదే సమాజ శ్రేయస్సు కోసం అయితే ఆ రాష్ట్రం చరిత్రలో నిలిచిపోతుందనడానికి చంద్రబాబు నాయుడు అందుకు తార్కాణం. ఉపాధికి ఊపిరి ఆయన.. యువ రక్తానికి ఆదర్శం ఆయన.. పేదోడి గుండెల్లో నిలిచిన ఆత్మీయ బంధువు చంద్రబాబు నాయుడు. నిన్న విశాఖపట్నం.. నేడు విజయవాడ లోని పేద ప్రజలు ఎన్నాళ్లో వేచిన ఉదయాన వారి చిరకాల స్వప్నాన్ని చంద్రన్న సాకారం చేస్తుండడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
దశాబ్దాలుగా సొంతింటి హక్కుల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల జీవితాల్లో సరికొత్త వెలుగులను కూటమి ప్రభుత్వం నింపుతున్నది. పేదల కళ్లను ఆనందబాష్పాలతో నింపుతూ, వారి కలలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమాన్ని నిర్వహించి 28,445 పేదలకు పట్టాలతో పాటు ఆస్తి యాజమాన్య బదిలీ పత్రాలను చంద్రబాబు అందించారు. అదే స్ఫూర్తితో ఈ నెల 30న విజయవాడ నగరంలోని 24,057 పేదలకు పట్టాభిషేకం చేయడం అపూర్వ ఘట్టం. విజయవాడలో ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాన అజెండాగా మారుతున్న ఇళ్ల పట్టాల సమస్యకు కూటమి సర్కార్ చరమగీతం పాడి సరికొత్త చరిత్రను సృష్టించింది. దశాబ్దాల క్రితం అందించిన ఎన్టీఆర్ పట్టాలకు చట్టబద్ధత కల్పిస్తూ, వాటిపై లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులను కట్టబెడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు రూ. 9,800 కోట్ల విలువైన 617 ఎకరాల భూమిపై పేద, మధ్య తరగతి కుటుంబాలకు అధికారం లభించనుంది. దీనివల్ల ఒక్కో కుటుంబానికి సుమారు రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది.
పట్టాభిషేకంలో లబ్ధిపొందే వారిలో బడుగు బలహీనవర్గాలవారే కావడం విశేషం. ఈ పట్టాల పంపిణీ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు, కృష్ణా జిల్లాలోని గన్నవరం సహా మొత్తం 8 నియోజకవర్గాల్లోని 15 మండలాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీలు 12,093, ఓసీలు 6,130, ఎస్సీలు 4,546, ముస్లిం బీసీలు 955, ఎస్టీలు 333 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. గత ప్రభుత్వాల కాలంలో కేవలం హామీలకే పరిమితమైన విజయవాడ ఇళ్ల స్థలాల సమస్యకు చంద్రబాబు నాయుడు పక్కా వ్యూహంతో ముగింపు పలికారు. ఈ నెల 30న జరగబోయే భారీ బహిరంగ సభలో ఏకంగా 24,057 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను సీఎం చంద్రబాబు స్వహస్తాలతో అందజేయనున్నారు. దశాబ్దాలుగా ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినా, ఎన్నో ఎన్నికలు వచ్చినా పరిష్కారం కాని ఈ సుదీర్ఘ నిరీక్షణకు కూటమి ప్రభుత్వం కేవలం కొద్ది నెలల పాలనలోనే చరమగీతం పాడటం విశేషం. తాము నివసిస్తున్న స్థలాలపై తమకు హక్కులు లేక, ఎప్పుడు ఏ ముప్పు వస్తుందోనని భయపడుతూ బతికిన విజయవాడ పేదలకు ఇది నిజంగా పండుగ.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన రాజకీయాన్ని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తున్న పట్టాలను పరిశీలిస్తే స్పష్టమైన తేడా కనిపిస్తున్నది. గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సెంటు భూమి పేరుతో ఊళ్లకు మైళ్ల దూరంలో, కొండల్లో, గుట్టల్లో, లోతట్టు ప్రాంతాల్లో కేవలం ‘కాగితాలు’ ఇచ్చి చేతులు దులుపుకుంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పేదలు దశాబ్దాలుగా ఎక్కడైతే నివాసం ఉంటున్నారో, ఆ విలువైన నగర ప్రాంతాల్లోనే వారికి సంపూర్ణ యాజమాన్య హక్కులతో కూడిన శాశ్వత పట్టాలను ఇస్తూ పేదల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
40 ఏళ్ల క్రితమే పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలనే గొప్ప ఆలోచనతో స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. అదే స్ఫూర్తితో మా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇన్నాళ్లూ తాము ఉంటున్న స్థలాలపై ఎలాంటి వివాదాలు, భయాలు లేకుండా శాశ్వత హక్కులు దక్కడంతో లబ్ధిదారుల్లో అపరిమితమైన ఉత్సాహం, ఆనందం వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఇచ్చిన అధికారంతో రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు ఒక్కో ఇటుకా పేరుస్తున్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు.. భయం నుంచి భరోసా వైపు.. నిరాశ నుంచి కొత్త ఆశల వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఇది పట్టాల పంపిణీ మాత్రమే కాదు.. పేదల ఆత్మగౌరవానికి పట్టాభిషేకం. హక్కులకు, పిల్లల భవిష్యత్తుకు పట్టాభిషేకం.
