అనకాపల్లి, నవంబర్ 2 (ఎక్స్‌ప్రెస్ టుడే): జిల్లాలో జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణ సోమవారం ఉదయం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ తదితర వివరాలను తెలియజేశారు.

అనకాపల్లి, బుచ్చయ్యపేట, కసింకోట, మునగపాక, పరవాడ మరియు సబ్బవరం మండలాలకు సంబంధించి ఏ. ఎం. ఏ. ఎల్. కాలేజ్ , కొత్తూరు విలేజ్, అనకాపల్లి నందు రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

చోడవరం మండలానికి సంబంధించి గవర్నమెంట్ హై స్కూల్ , గంది గ్రామం, చోడవరం మండలం నందు రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

దేవరపల్లి మరియు కె కోటపాడు మండలాలకు సంబంధించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం (బాయ్స్), తెనుగు పూడి దేవరపల్లి మండలం నందు రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నక్కపల్లి మండలానికి సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నక్కపల్లి నందు, పాయకరావుపేట మరియు ఎస్ రాయవరం మండలాలకు సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్, నక్కపల్లి నందు రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మాకవరపాలెం, నర్సీపట్నం మరియు రోలుగుంట మండలాలకు సంబంధించి డాన్ బాస్కో స్కూల్, పెద్ద బొడ్డేపల్లి నందు, కోటవురట్ల, గొలుగొండ, నాతవరం మరియు రావికమతం మండలాలకు సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం నందు రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వి. మాడుగుల మరియు చీడికాడ మండలాలకు సంబంధించి సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ , విమాడుగుల నందు రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అచ్యుతాపురం మరియు రాంబిల్లి మండలాలకు సంబంధించి ఇండోర్ స్టేడియం ఎలమంచిలి నందు ఎలమంచిలి మండలానికి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, ఎలమంచిలి నందు రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ తెలిపారు.