అనకాపల్లి, అక్టోబర్ 23: ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అక్టోబర్ 19న జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండవ సాధారణ ఎన్నికలను ప్రకటించిందని, షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21 నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
ఇప్పటివరకు అన్ని ప్రాంతాలలో నామినేషన్ల దాఖలు చాలా ప్రశాంతంగా జరుగుతోందని, అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటలతో నామినేషన్ ప్రక్రియ పూర్తి కానుందని పేర్కొన్నారు. నామినేషన్ల దాఖలులో ఎవరికైనా సమస్యలు ఉంటే వెంటనే తెలియజేస్తే తగిన రక్షణ చర్యలు మరియు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయబడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నంబర్ 08924-222888 కు ఫోన్ చేయవచ్చని, పోలీస్, రెవెన్యూ మరియు పంచాయతీరాజ్ శాఖల ద్వారా తగిన ఏర్పాట్లు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.
