అమరావతి, అక్టోబర్ 28 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు రైల్వే కనెక్టివిటీ, పీఎం ఏక్తా మాల్స్, బల్క్ డ్రగ్ పార్కుల అభివృద్ధి, పీఎం సేతు సహా ఐటీఐ ఈకోసిస్టమ్ వంటి ప్రగతి అంశాలపై బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం ద్వారా ఆయా ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షిస్తున్నారు.

ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు, కార్యదర్శులు కోన శశిధర్, డా. ఎన్. యువరాజ్, దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.