అమరావతి, అక్టోబర్ 19 (ఎక్స్‌ప్రెస్ టుడే): విజయదశమి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు సందేశాన్ని వెలువరించారు.

విజయదశమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నవరాత్రి పండుగ ధర్మం యొక్క గొప్పతనాన్ని, చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని సూచిస్తుంది.

ఈ సంతోషకరమైన విజయదశమి పండుగ వేళ, దైవ స్వరూపిణి అయిన దుర్గామాత మనందరిపై తన దివ్య ఆశీస్సులను కురిపించాలని కోరుకుంటున్నాను.