అమరావతి, అక్టోబర్ 31 (ఎక్స్ప్రెస్ టుడే): అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ హై స్కూలులో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాల తరగతి గదిలో రంపంతో అత్యంత అమానుషంగా దాడి చేయడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స గురించి సీఎం అధికారులతో మాట్లాడారు.
ఉన్మాదిపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశాలు
నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీఎం పోలీసు అధికారులను ఆదేశించారు.
