అమరావతి, అక్టోబర్ 28 (ఎక్స్‌ప్రెస్ టుడే): గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ వైద్యులు పాటిబండ్ల దక్షిణామూర్తి మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేసిన అనంతరం 1973లో గీతా నర్సింగ్ హోమ్‌ను ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందించారని కొనియాడారు.
వైద్య విజ్ఞానాన్ని ప్రజలకు అర్థమయ్యేలా జీవశాస్త్ర విజ్ఞానం, డాక్టరుగారి డైరీ, డయాబెటిస్ గైడ్ వంటి ఎన్నో పుస్తకాలను ఆయన ప్రచురించారని పేర్కొన్నారు. దక్షిణామూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన సీఎం... ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
