విజయవాడ, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో 2026–27 ఏడాదికి ఏ4 మద్యం షాపుల లైసెన్స్ రెన్యూవల్ ప్రక్రియకు మంచి స్పందన లభిస్తోంది. ఈరోజు నాటికి రాష్ట్రంలోని 3,652 ఏ4 షాపుల్లో 1,970 షాపులు రెన్యూవల్‌కు ముందుకు రాగా, 1,220 షాపులు పూర్తి లేదా పాక్షికంగా చెల్లింపులు చేశాయి. వీటి నుంచి మొత్తం రూ.403.25 కోట్లు వసూలయ్యాయి. రెన్యూవల్‌కు గడువు సెప్టెంబర్ 21తో ముగియనుంది.
రెన్యూవల్‌కు ముందుకు వచ్చిన షాపుల్లో 686 పూర్తిగా, 534 పాక్షికంగా చెల్లింపులు చేశాయి. దీంతో రెన్యూవల్‌కు ముందుకు వచ్చిన షాపుల్లో 61.9 శాతం ఇప్పటికే చెల్లింపులు పూర్తి చేసినట్లు అయ్యుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెన్యూవల్‌కు ముందుకు వచ్చిన మొత్తం 30 షాపుల నుంచి చెల్లింపులు జరిగాయి. విశాఖపట్నం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 85 శాతం, పశ్చిమగోదావరిలో 84 శాతం, తూర్పుగోదావరిలో 77 శాతం, ఏలూరులో 75.5 శాతం చెల్లింపులు జరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా 1,682 షాపులు రెన్యూవల్‌కు ఆసక్తి చూపలేదు. మరో 750 షాపులు రెన్యూవల్‌కు ముందుకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపు చేయలేదు.
వసూలైన రూ.403.25 కోట్లలో రెన్యూవల్ ఆర్‌ఈటీ, అప్లికేషన్ ఫీజు ద్వారా రూ.236.48 కోట్లు, వార్షిక ఆర్‌ఈటీ ద్వారా రూ.145.03 కోట్లు, పర్మిట్ రూమ్ ఆర్‌ఈటీ ద్వారా రూ.21.81 కోట్లు వచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
