2026-27 మద్యం విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త విధానం ప్రకారం మద్యం దుకాణాల రెన్యూవల్, కొత్త దరఖాస్తులు, లాటరీ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను ఎక్సైజ్ శాఖ ఖరారు చేసింది.

  • 2026-27 ఎక్సైజ్ విధానంపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు రెండు నెలల డీఏలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు
  • మద్యం దుకాణాల రెన్యూవల్, కొత్త దరఖాస్తుల ప్రక్రియకు షెడ్యూల్ ఖరారు

కొత్త ఎక్సైజ్ విధానంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఊరటనిస్తూ ఆర్థిక శాఖ మరో కీలక ఉత్తర్వు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న రెండు నెలల కరవు భత్యం (డీఏ)లను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దీనితో లక్షలాది మంది ఉద్యోగులు, పింఛనుదారులకు ఆర్థిక ఊరట లభించనుంది.

మద్యం దుకాణాల రెన్యూవల్‌కు సంబంధించి నిర్దేశిత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని, గడువు ముగిసిన తర్వాత లాటరీ విధానం ద్వారా మిగిలిన దుకాణాలను కేటాయిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.