భారతీయ ఓటీటీ చరిత్రలో సంచలనం సృష్టించిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ 'మిర్జాపూర్' ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది.

అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ మరియు ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 4న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇటీవలే అధికారిక ట్రైలర్‌ను విడుదల చేశారు.

గురు్‌మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, సిరీస్‌లో అదరగొట్టిన ప్రధాన నటీనటులంతా మళ్లీ పెద్ద తెరపై తమ విశ్వరూపం చూపించనున్నారు.